రంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశను నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ధ్వంసమైన శిలా ఫలకం వద్ద బిఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి కార్తీక్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకులతో పాటు కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. మెట్రో రెండో దశ పనులను త్వరగా ప్రారంభించాలని బిఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
తొలి దశ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందడుగు వేసిన విషయం తెలిసిందే. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్‌అండ్‌టి సంస్థ చేసిన 13 వేల కోట్లు అప్పులు చెల్లించడంతో పాటు మరో రెండు వేలు కోట్లు ఎల్‌అండ్‌టికి ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.