యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో దొంగ నోట్లు వెలుగుచూశాయి. స్థానిక ఖీలానగర్‌లో మొబైల్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పల్లెర్ల నాగేంద్రబాబు వద్దకు సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన వద్ద రూ.11 వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో నాగేంద్రబాబు తన ఫోన్ పే ద్వారా అతడు చెప్పిన నెంబర్‌కు ఫోన్ పే చేసి నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత చెక్ చేయగా అవి నకిలీవని తేలింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన నాగేంద్రబాబు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.