దుబాయ్: ఆసియాకప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి భారత్ తొమ్మిదొసారి ట్రోఫీని అందుకుంది. ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. అయితే ఈ క్రమంలో కుల్దీప్ ఆసియాకప్ చరిత్రలోనే తిరుగులేని ఘనతను సాధించాడు. ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. పాక్ ఆటగాడు సైయిమ్ అయూబ్ వికెట్‌తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్లు శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉండేది.
మలింగ ఆసియాకప్‌లో 33 వికెట్లు తీశాడు. తాజాగా పాక్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో కలిసి ఈ టోర్నమెంట్‌లో మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసియాకప్(వన్డే, టి-20)లో 36 వికెట్లు తీసి మలింగాను అధిగమించాడు. అంతేకాకుండా ఆసియాకప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీశాడు. గతంలో ఈ రికార్డు ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉండేది. తాజాగా కుల్దీప్ 17 టికెట్లు తీసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.