హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంటేనే ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆడబిడ్డలందరూ ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సోమవారం అతి పెద్ద బతుకమ్మ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు లభించాయి. 63 అడుగుల భారీ బతుకమ్మగా గిన్నిస్ రికార్డు నమోదైంది. దీంతో పాటు 1,354 మంది మహిళలతో అతి పెద్ద తెలంగాణ జానపద నృత్యంగా రికార్డు సాధించింది. 63 అడుగుల ఎత్తు గల బతుకమ్మని 11 అడుగుల వెడల్పుతో, 7 టన్నుల బరుపుతో ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. మంత్రి సీతక్క బతుకమ్మ పాట పడి అలరించారు.