ముంబయి: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయ దుందుభి మోగించింది. ఇప్పటి ఆసియా కప్‌ను భారత్ తొమ్మిది సార్లు గెలుచుకుంది. ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలవడంతో కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ తన ఎక్స్‌లో స్పందించారు. విజయం వరించగానే అందరూ క్రికెటర్లను ప్రశంసిస్తున్నారని, తెరవెనుక జరిగి వాటి గురించి తెలియదన్నారు. అపజయాలు వచ్చినప్పుడు కోచ్, సెలక్టర్లపై విమర్శలు వస్తాయని, విజయాలు వరించినప్పుడు వాళ్లను పట్టించుకోవడంలేదని బాధను వ్యక్తం చేశారు. అసియా కప్‌లో గెలవడంతో కోచ్, సెలక్టర్ల పాత్ర ఉండడంతో వారిని అభినందాద్దామని తెలిపారు.