రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. హోంబలే ఫిలమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘కాంతార రిషబ్ శెట్టి డ్రీమ్ ఈ సినిమా. ఈ కలని నెరవేర్చడానికి హోంబలే ఫిలమ్స్ సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్‌గా ఈ చిత్రం నిలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, హీరోయిన్ రుక్మిణి వసంత్ తదితరులు పాల్గొన్నారు.