కరూర్ లో తొక్కిసలాటకు నటుడు, రాజకీయనాయకుడు విజయ్ కారణమని ఎఫ్ ఐఆర్ లో ఆరోపించారు. . ఈ తొక్కిసలాటలో 41 మంది మరణించారు. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చాడని, అనుమతి లేకుండా రోడ్ షో చేశాడని పేర్కొన్నారు. అందువల్లనే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు.ఎఫ్ ఐఆర్ ప్రకారం టివికె పార్టీ జిల్లా కార్యదర్శి మథియ జగన్ పదివేల మంది హాజరుకు అనుమతి కోరారు. విజయం వస్తున్నారన్న వార్తతో 25 వేల మంది సభాస్థలి వద్ద గుమికూడారు. జన సమూహాన్ని పెంచడానికి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఎఫ్ ఐఆర్ లో ఆరోపించారు. కార్యక్రమాన్ని సకాలంలో నిర్వహించకుండా, విజయ్ నాలుగు గంటలు ఆలస్యంగా కరూర్ చేరారు. ఫలితంగా నాలుగు గంటలపాటు ఎండలో నిలబడ్డ జనం అలసి పోయారు. దీని కారణంగానే తొక్కిసలాట జరిగి. అక్కడి కక్కడే 11 మంది చనిపోయారు. చాలామంది ఆస్పత్రిపాలయ్యారని ఎఫ్ ఐఆర్ ఆరోపించింది.
విజయ్ సాయంత్రం 4.45 గంటలకు వేలాయుథపాళియం వద్ద జిల్లా సరిహద్దులకు చేరాడడని, ఆనుమతి లేకుండా ఆలస్యంగా రోడ్ షో నిర్వహించాడని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.విజయ్ కాన్వాయ్ సాయంత్రం 7 గంటలకు వేలుచామిపురం చేరగా, అప్పటికే జనాల్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని, జనం ఊపిరాడక, గాయపడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించినా, సభ నిర్వాహకులు మథియజగన్, బుషి ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్ పట్టించుకోలేదని తెలుస్తోంది.పోలీసులు మద్దతు కల్పించినా, టివికె నాయకులు జనాల్ని అదుపు చేయడంలో విఫలమయ్యారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. జనం చెట్లమీద, రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన షెల్టర్ల పై కూర్చోగా ఆవన్నీ వారి బరువుకు కూలిపోయాయి. కంద నిలబడ్డ జనం చిక్కుకు పోయారు. వారిలో కొందరు ఊపిరి ఆడక చనిపోయారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకూ సభ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. విజయ్ రాక ఆలస్యం అయింది. రాజకీయ ప్రకటన చేస్తారని పెద్దగా తరలివచ్చిన జనం ఇబ్బందుల పాలయ్యారు.
ఎఫ్ ఐఆర్ లో ముగ్గురు సీనియర్ నాయకులు- జిల్లా కార్యదర్శి మథియ జగన్, రాష్ట్రప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్, సంయుక్త కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ పేర్లను పేర్కొన్నారు.భారతీయ న్యాయ సంహిత పలు సెక్షన్ల కింద, తమిళనాడు ప్రజా ఆస్తి చట్టం సెక్షన్ 9 కింద కేసులు నమోదు చేశారు.