సంగారెడ్డి: ఆస్తుల కోసం ఆడపడుచుల వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్కాపూర్ శివారులోని గీతానగర్ కాలనీలో మల్లిఖార్జున(35), దివ్యశ్రీ(32) అనే దంపతులు నివసిస్తున్నారు. మల్లిఖార్జున ఒక పరిశ్రమలో పని చేస్తుండగా దివ్యశ్రీ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా జాబ్ చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఆడపడుచులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో దివ్యశ్రీ మానసికంగా ఆందోళనలు ఉన్నారు. ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చి భర్తకు భార్య విగతజీవిగా కనిపించడంతో కన్నీంటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.