దుబాయ్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గెలిచి కప్‌ను కైవసం చేసుకుంది. ఆసియా కప్‌లో మూడుసార్లు పాక్‌పై భారత్ విజయం సాధించింది. ట్రోఫీ ప్రజెంటేషన్, మెడల్స్ స్వీకరించే కార్యక్రమం దాదాపుగా గంటన్నర పాటు ఆలస్యం జరిగింది. ట్రోఫీని, మెడల్స్ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు అంగీకరించలేదు. ఎసిసి అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ పాక్ చెందిన వ్వక్తి కావడంతో టీమిండియా సభ్యులు తీసుకోలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు వేరే అతిథుల నుంచి తీసుకున్నారు. అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అసలైన ట్రోఫీలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయని, 14 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందే నిజమైన ట్రోఫీలు అని తెలిపారు. తాము గెలిచిన తరువాత సంబరాలు చేసుకోవడానికి గంటన్నర పాటు వేచి ఉన్నాయని, ఛాంపియన్ ట్రోఫీ బ్యానర్ తీసుకరావడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ట్రోఫీ అందుకోలేదన్నారు. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని ఎవరి నుంచి ఆదేశాలు రాలేదని తెలియజేశారు. ఆసియా కప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చి మ్యాచ్ ఫీజు ఇండియా సైన్యం కోసం ఇస్తున్నానని సూర్య ప్రకటించారు.