అమరావతి: పార్టీ కార్యకర్తలైనా.. నాయకులైనా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరు అని అన్నారు. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలతో సిఎం టెలికాన్ఫరెన్స్ జరిపారు. సిఎంతో టెలీకాన్ఫరెన్స్ లో గ్రామస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11మంది వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, వైసిపి ఎమ్మెల్సిలు సభకు రావడం ఇదేం ద్వంద వైఖరి అని విమర్శించారు. వైసిపి అసమర్థవిధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పెరిగిందని, విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి అనేక సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని, భవిష్యత్తులో ప్రజలపై రూ. వెయ్యి కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని తెలియజేశారు. జిఎస్టి సంస్కరణలపై ప్రజలకు కార్యకర్తలు వివరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని అన్నారు. కూటమి జిఎస్టి సంస్కరణల ఉత్సవ్ ప్రచారం చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.