ఢిల్లీ: లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమానికి చెందిన స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథి తన ఆశ్రమంలో చదువుకుంటున్న 17 మంది విద్యార్థులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో బాబా పారిపోతుండగా ఆగ్రాలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థికంగా వెనకబడిని విద్యార్థులకు శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. శ్రీశారద ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. చైతన్యానంద సరస్వతి పలువురి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అశ్లీల సందేశాలు పంపడం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మహిళా టీచర్లు, సిబ్బంది కూడా తన మాటా వినాలని పలుమార్లు ఒత్తిడి తీసుకోచ్చారని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అతడిపై 2009, 2016లో కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు సమాచారం. బాబాపై ఆరోపణలు రావడంతో శ్రీ శృంగేరీలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డు కూడా అతడిని డైరెక్టర్ పదవినుంచి తొలగించింది. .