హైదరాబాద్: గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తెలుగు సినిమాలోకి హీరోగా అడుగుపెట్టి 18 సంవత్సరాలు పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగారు. అయితే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ రామ్ చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో చరణ్ రైలు పట్టాలు దాటుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మా పెద్ది ఇండస్ట్రీలోకి వచ్చి 18 ఏళ్లు పూర్తి కావడం మాకు ఎంతో సంతోషం. తెరపైన ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే.. బయట ఎంతో వినయ విధేయతతో ఉంటారు. తనకంటే ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పర్చుకున్నారు. మాకంతో ఉత్సాహాన్ని కలిగించి సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ది నుంచి చాలా సర్‌ప్రైజ్‌లు వస్తాయి’’ అని పెద్ది చిత్ర యూనిట్ పేర్కొంది.
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా పెద్దిని దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 మార్చి 27 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది