ఆసియాకప్-2025లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడోసారి తలపడుతున్నాయి. గ్రూప్ దశలో ఒకసారి, సూపర్-4లో రెండోసారి ఈ రెండు జట్లు తలపడగా.. టీం ఇండియానే విజయం సాధించింది. మరికొన్ని గంటల్లో ఫైనల్‌లో ముచ్చటగా మూడోసారి ఈ రెండు జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచి పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పించాలని భారత అభిమానులు ఆశపడుతున్నారు.
అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించాలంటే.. ముందు నుంచే అధిపత్యం చూపించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. పవర్‌ప్లేలోనే భారత్ పట్టు సాధించాలని పేర్కొన్నారు. ‘‘పవర్ ప్లేలో మ్యాచ్‌పై పట్టు సాదించాలి. చాలాసార్లు మ్యాచ్ చివరి వరకూ వెళ్తోంది. ఆరంభంలోనే సత్తా చాటితే మ్యాచ్ మీదే. పవర్‌ప్లేలో భారత్ విఫలమైన ఏం కాదు.. ఆ తర్వాత పుంజుకోవచ్చు. అయితే పాకిస్థాన్‌కు అది సాధ్యం కాదు. వారిని ఆదిలోనే నియంత్రిస్తే.. ఇక ఆ జట్టు కోలుకోలేదు’’ అని అకాశ్ విశ్లేషించారు