చెన్నై: కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై టివికె అధినేత, నటుడు విజయ్ స్పందించారు. తన హృదయం ముక్కలైందని, చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంతో తాను విలవిలలాడుతున్నానని బాధను వ్యక్తం చేశారు. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నానని వివరించారు. విజయ్ ర్యాలీ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై కరూర్ కలెక్టర్‌తో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడారు. విజయ్ ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది.