కైరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 66 వేలకు పైగా పాలస్తీనియులు చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న యుద్ధంలో 66,005 మంది చనిపోగా, 168162 మంది గాయపడ్డారని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గత 24 గంటల్లో 79 మంది చనిపోయారు. వారి మృతదేహాలను ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం గాజా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్‌లో ఉన్నారు. ఆయన సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు.