మన తెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 29 నుంచి ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నారు. పార్టీ ఫి రాయించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ప ది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్ర సాద్ కుమార్ ఇదివరకే నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నెల రెండవ తేదీలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లి ఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా, వారు మరో పది రోజుల గడువు కావాలని కోరారు. ఆ గడువు కూడా ముగిసింది.ఇదిలాఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అ రికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌తో సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. వివరణ ఇచ్చేందుకు తనకు ఈ నె లాఖరు వరకు గడువు ఇవ్వాల్సిందిగా ఎ మ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. కాలేయాదయ్య, గాంధీ, ప్రకా ష్ గౌడ్ ఇదివరకే వివరణ ఇచ్చారు.
తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ స్పీకర్‌కు గత ఏడాది ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ కనీసం వారికి నోటీ సు కూడా ఇవ్వకుండా జాప్యం చేశారని బి ఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సర్వోన్నత న్యాయ స్థానం మూడు నెలల్లోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని స్పీకర్‌కు సూచించింది. ఇదిలాఉండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే నెల ఆ రవ తేదీన విదేశీ పర్యటనకు వెళ్ళనున్నందు న ఈ నెల 29 నుంచి ప్రత్య క్ష విచారణను ప్రారంభించాలనిభావిస్తున్నారు.విచారణ ప్రారంభించినట్లయితే
కోర్టు నుంచి సమస్య ఉండదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కూడా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్లే అవుతుందా? అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాము పార్టీ ఫిరాయించలేదని, కేవలం నియోజకవర్గంలోని సమస్యలు చెప్పేందుకే ముఖ్యమంత్రిని కలిసామని వారు చెబుతున్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పిఎసి) చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన రుజువు అని బిఆర్‌ఎస్ పేర్కొంది. అయితే పిఎసి చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికే ఇస్తారు కాబట్టి ఆ విధంగా తనకు ఆ పదవి లభించిందే తప్ప తాను పార్టీ ఫిరాయించలేదని గాంధీ స్పీకర్‌కు అందజేసిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
కడియం శ్రీహరి ఈ నెలాఖరు వరకూ గడువు కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్‌ఎస్‌లో ఉంటూనే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. పార్టీ ఫిరాయించారనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని బిఆర్‌ఎస్ వాదిస్తోంది. మిగతా ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, ప్రతి నెలా ఐదు వేల రూపాయలు బిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి ఖర్చుల నిమిత్తం చెల్లిస్తున్నామని వివరించారు. విచారణను వేగవంతం చేయాలని స్పీకర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.