పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమాను రూపొందించిన సుజీత్.. ఫ్యాన్స్ ఎలా కోరుకున్నారో అంతకుమించి పవన్ ను చూపించాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలు సుజీత్ తీయగా.. అందులో రెండు సీరియస్ యాక్షన్ జోనర్‌లోనే ఉన్నాయి. ఎక్కువగా యాక్షన్ జోనర్ కే తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కామెడీని సుజీత్ మిస్ అవుతున్నాడట. అందుకే భవిష్యత్తులో విభిన్నమైన జోనర్స్‌లో సినిమాలు తీస్తానని ఈ యంగ్ డైరెక్టర్ తెలిపాడు. దీంతో సుజీత్.. తన అప్ కమింగ్ మూవీ డార్క్ కామెడీ జోనర్‌లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే తన తదుపరి చిత్రం వచ్చే ఏడాది ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల అవుతుందని హామీ ఇచ్చాడు సుజీత్. నేచురల్ స్టార్ నానితో వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకుంటున్నట్టు, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు చెప్పాడు. ఆ మూవీ షూటింగ్ చాలా కష్టమని, అది వేరే రకమైన ఎడిటింగ్, మ్యూజిక్‌తో కూడిన ప్రయోగాత్మక చిత్రమని అన్నాడు. ఎక్కువ భాగం షూటింగ్ యూరప్‌లో జరుగుతుందని తెలిపాడు. ది ప్యారడైజ్ సినిమాను నాని పూర్తి చేసిన తర్వాత తన సినిమా షూట్ ప్రారంభమవుతుందని సుజీత్ వివరించాడు.