రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు శనివారం(సెప్టెంబర్ 27) నుంచి దసరా సెలవులు ప్రకటించింది. ముందుగా ఆదివారం నుంచి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఒక రోజు ముందు నుండే దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని, వచ్చే నెల 6వ తేదీన కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. అన్ని కాలేజీలు సెలవుల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలని చెప్పారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే ఆయా కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.