మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి దశలో ఎంపీటీసీ, జ డ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది.ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనా భా లెక్కల ప్రకారం, బీసీలకు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలి పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఖరారు చేయనుండగా, మండల ప్రజా పరిషత్ జడ్పిటిసి స్థానాల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు కరాట్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఆర్డిఓ స్థాయి అధికారులు ఖరారు చేస్తారు.