ప్రపంచ సుందరి ఒపాల్ సుచాతా చువాంగ్ శ్రీ తెలంగాణ బతుకమ్మ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ నెల 29న జరిగే సంప్రదాయ పండగ బతుకమ్మ కార్యక్రమంలో ఆమె సందడి చేయనున్నారు. కాగా హైదరాబాద్ వచ్చిన ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28న జరిగే కాన్సర్ అవగాహన ర్యాలీ పింక్ రన్‌లో పాల్గొంటానని తెలిపారు. కాన్సర్ వల్ల అనేకమంది మహిళలు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తన మొదటి ప్రాధాన్యం కాన్సర్‌పై అవగాహనే అని స్పష్టం చేశారు. ఇక 29న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని తెలిపింది. హైదరాబాద్‌లో తాను ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యనని ఈ ప్రాంతం తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. ఇదిలా ఉండగా ఫర్క్యూన్ సంస్థ శనివారం రోజు అనాధ లకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో ఆమె పాల్గొంటారని నిర్వాహకుడు డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఏడాది పాటు అనాధ పిల్లలకు అవసరమైన వస్తువులను సమకూరుస్తామని చెప్పారు.