తీరం దాటనున్న వాయుగుండం…! ఏపీలో ఇవాళ భారీ వర్షాలు, తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు September 26, 2025 by admin బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో… తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.