సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరో మలుపు తిరిగింది. ఇందులో మత్తయ్య పాత్రపై విచారణ చేసేందుకు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును శుక్రవారం వెళ్లడించింది. ఓటుకు నోటు జెరూసలేం మత్తయ్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. మత్తయ్య పేరును కేసులో క్వాష్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. ఓటుకు నోటు కేసు నుంచి జేరుసలెం మత్తయ్య పేరును హైకోర్ట్ క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఎ4గా ఉన్న మత్తయ్యను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వ ం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అప్పటి నుంచి విచారణ సాగింది. సుదీర్ఘంగా సాగిన విచారణ ఈ నెల 22తో ముగిసింది. ఇరువైపులా వాద నల విన్న తర్వాత సుప్రీం కోర్ట్ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడిం చారు. ఓటుకు నోటు కేసు 2016లో వెలుగు చూసింది. ఇందులో ప్రేరేపితుడిగా మత్తయ్యను ఎ4గా చేర్చారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో వాదించి ఆయనపై ఉన్న కేసును క్వాష్ చేయించుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచా రణ పూర్తై తీర్పు వచ్చే తరుణంలో ఈ మధ్య కాలంలో మత్తయ్య సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఇందులో సూత్రధారులు పాత్రధారులు ప్రస్తుతం ముఖ్య మంత్రులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబుదేనంటూ బాంబు పేల్చారు. సుప్రీం చీఫ్ జస్టీస్‌కు రాసిన లేఖ అంటూ మత్తయ్య ఓ ఓపెన్ లెటర్ రాశారు. ఇందులో సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి తనను పిలిచి ఓటు నోటు కేసు గురించి మాట్లాడారని ఓ ఎంఎల్‌సిని ఒప్పించాలని కూడా సూచించినట్టు చెప్పుకొచ్చారు. ఐదు కోట్లు తీసుకొని తమకు అనుకూలంగా ఓటు వేసేలా నచ్చజెప్పాలని కూడా ప్రోత్సహిం చినట్టు లేఖలో వెల్లడించారు. ఈకేసులో అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలను రద్దు చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.