పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజాసాబ్.. మరోవైపు ఫౌజీ చిత్రాలకు డేట్లు కేటాయించి పగలు, రాత్రి పని చేస్తున్నాడు. ఫౌజీ మొదలైన అనంతరం తాత్కాలికంగా రాజాసాబ్‌ని కొన్ని నెలల పాటు పక్కన బెట్టినా? ఆలస్యమవ్వడంతో ఆ చిత్రాన్ని కూడా ఫౌజీతో పాటు మళ్లీ తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాల షూటింగ్‌లు రామోజీ ఫిలింసిటీలోనే వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతున్నాయి. దీంతో ప్రభాస్ రెండు సినిమా షూటింగ్‌లకు హాజరవుతుండడం విశేషం. ఒకేసారి ఒకే రోజు రెండు సినిమా షూటింగ్ లకు హాజరవ్వడం అంత సులభం కాదు.
ఈ రెండు చిత్రాలకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ కావడంతో ప్రభాస్ తో పాటు ఇతర తారాగణం పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఒక రోజు పూర్తిగా ఫౌజీకి కేటాయిస్తే మరో రోజు రాజాసాబ్‌కి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు రెండు షూటింగ్‌లకు ప్రభాస్ హాజరైతే కొంత ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో మేకర్స్ ఇలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజాసాబ్ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో జనవరి 9న విడుదలకానుంది.