దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీలోని ఒక ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ హెడ్ అయిన స్వామి చైతన్యానంద సరస్వతిపై కేసు నమోదైంది. విద్యార్థినులను బెదిరించి లైంగికంగా వేధించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.