నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు: ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేయాలని ఒత్తిడి, మంత్రుల రాజీనామా పర్వం!
నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.