జన్‌జీని విస్మరిస్తే ఉద్యమాలు తప్పవు
మన తెలంగాణ/హైదరాబాద్: యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్య తిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆ లోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చు ట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు.. ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధించారని ఆరోపించారు. […]