బిజెపిది నకిలీ జాతీయవాదం: కెటిఆర్

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) […]