దసరా కానుకగా ‘వాయుపుత్ర’
గొప్ప యోధుడైన హనుమంతుడు కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. భారీస్థాయిలో 3డి యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ’వాయుపుత్ర’, హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. […]