ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం
ఉత్తరాఖండ్‌ను గురువారం మరోసారి వరద బీభత్సం దెబ్బతీసింది. ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలోని గోపేశ్వర్ ప్రాంతంలో భారీ కుండపోత వర్షాలు తరువాత కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 11 మంది గల్లంతు అయ్యారని అధికార వర్గాలు తెలిపాయి.జిల్లాలోని నాలుగు గ్రామాల వర్షాల ధాటికి భీతిల్లాయి. ఎక్కడ చూసినా చెట్లు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, ఇళ్లపై కొండచరియలు కూలడంతో జనజీవితం అస్థవ్యవస్థం అయింది. కుంటారీ గ్రామంలో ఓ వ్యక్తి శవాన్ని అక్కడి చెత్తాచెదారంలో కనుగొన్నారు. […]