ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. ఇళ్లు, రోడ్లు ధ్వంసం.. పలువురు గల్లంతు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ సంభవించింది.డెహ్రాడూన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోనూ మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. పలువురు గల్లంతయ్యారు. వరదతోపాటు వచ్చిన బురద ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, రహదారుల పైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక వంతెన కొట్టుకుపోయింది. డెహ్రాడూన్‌లో ప్రవాహ ఉధ్ధృతికి ఐదుగురు కొట్టుకుపోయారు. 584 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. తమ్సా, టన్స్, సాంగ్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తమ్సా నది గట్టుపైన తాపకేశ్వర ఆలయం […]