అమెరికా నేతలు అవినీతిపరులు.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్
ఇస్లామాబాద్: ఓ పక్క పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతి పరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. పాక్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడుతూ “ మేము లంచాలు స్వీకరించామని తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నాం. […]