యుపిఎస్‌సి తరహాలో పరీక్షలు నిర్వహించండి: రాంచందర్ రావు
యుపిఎస్‌సి తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిజిపిఎస్‌సి) కూడా జాబ్ క్యాలెండర్ రూపొందించి ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగక ముందే నోటిఫికేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. గ్రూపు 1, గ్రూపు 2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది […]