కదులుతున్న ఆటోలో వేలాడుతూ… సహాయం కోసం అరుపులు (వీడియో వైరల్)

Spider women in Auto

ఛండీగఢ్: పట్టపగలే కదులుతున్న ఆటోలో ఓ మహిళను దుండగులు బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె ఆటోలో నుంచి వేలాడుతూ సహాయం కోసం అరిచింది. దుండుగులతో మహిళ ధైర్యంగా పోరాడి తప్పించుకుంది. ఈ సంఘటన పంజాబ్‌లోని జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై జరిగింది. మహిళ ఆటో ఎక్కిన వెంటనే కొంచెం దూరం వెళ్లిన తరువాత డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమె వద్ద దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆమె భయపడకుండా ఆటో నుంచి బయటికి వేలాడుతూ సహాయం కోసం బిగ్గరగా […]

మస్క్​ని వెనక్కి నెట్టిన ‘కాలేజ్​ డ్రాపౌట్​’- సంపన్నుల జాబితాలో టాప్​! ఎవరు ఈ Larry Ellison?

టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ను అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో లారీ ఎల్లిసన్ కొంతసేపు అగ్రస్థానంలో నిలిచారు. ఒరాకిల్ షేర్లు అనూహ్యంగా పెరగడంతో, ఆ కంపెనీ ఫౌండర్​ ఎల్లిసన్ సంపద భారీగా వృద్ధిచెందింది.

ఫేవరెట్‌గా బంగ్లాదేశ్.. నేడు హాంకాంగ్‌తో పోరు

అబుదాబి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ గురువారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్‌బిలో భాగంగా అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో బంగ్లా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. బలమైన బంగ్లాను ఓడించడం హాంకాంగ్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

Charlie Kirk : ట్రంప్​ సన్నిహితుడు కాల్చివేత! గన్​ కల్చర్​ గురించి మాట్లాడుతుండగా కాల్పులు..

ట్రంప్​నకు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన ఛార్లీ కిర్క్​.. యూటాలోని ఓ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో మరణించారు! ఆ సమయంలో ఆయన కాల్పుల ఘటనల గురించి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.

నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ వాసులను తీసుకొస్తాం : మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పౌరులను తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో వారిని తీసుకురానున్నట్టుగా తెలిపారు.

గాంధీ సరోవర్‌కు రక్షణ భూములు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమ సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను […]

వీసాలపై వెయ్యికళ్ల నిఘా

అమెరికాలోని భారతీయ విద్యార్థుల కదలికలపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. భారత దేశంనుంచి విద్యార్థులు నిజంగా చదువులకోసం వచ్చారా లేదా చట్ట వ్యతిరేకంగా ఏవైనా ఉద్యోగాలు చేస్తున్నారా? సరైన అధికారిక పత్రాలతో వచ్చారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై తీవ్రంగా నిఘా కొనసాగుతోంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా హెచ్1బి, ఎఫ్1 వీసాదారుల అనధికారిక సంపాదనపైనా నిఘా పెడుతున్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని ఇమిగ్రేషన్ అధికారులకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) […]

నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi

డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరాఖండ్‌లో గురువారం పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆ రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఉత్తరాదితోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, తదితర రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో […]

విద్య, వైద్యం జాతీయీకరణ జరగాలి

విద్య-, వైద్య రంగాలలో నెలకొన్న అసమానతలు తొలగించకుండా సామాజిక,-ఆర్థిక-, రాజకీయ -సాంస్కృతిక రంగాలలో సమానత్వం సాధించడం అసాధ్యం. ప్రజల మధ్య సోదర భావం, జాతీయ ఐక్యత, సమైక్యత సాధించాలంటే విద్య,-వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించేలా తగు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ విద్య, -వైద్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు తగిన కృషి జరపాలి. అంతర్గత వలసాధిపత్యాన్ని, వనరుల దోపిడీ, తరలింపును నిరసిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక పద్ధతుల్లో సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ […]

డాలర్‌కు ప్రత్యామ్నాయం తక్షణావసరం

డీడాలరైజేషన్ అంటే ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థికం, కరెన్సీ నిల్వలలో అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుని, బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకునే ప్రక్రియ. ఇది దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలకు వర్తిస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో అనేక దేశాలు వివిధ కారణాల వల్ల డీడాలరైజేషన్‌ను అనుసరిస్తున్నాయి. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా చారిత్రక, ఆర్థిక నిర్మాణాత్మక అంశాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి వినిమయ మాధ్యమంగా డాలర్‌ను […]