క్రికెట్ మ్యాచే కదా.. జరగనివ్వండి: భారత్-పాక్ పోరుపై సుప్రీం

న్యూఢిల్లీ : ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దుకు దాఖలైన పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ తేదీ ఖరారు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోవ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ వచ్చింది. 2025 ఆపియా కప్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ […]

విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు కార్మికుల మృతి

బోధన్ జిల్లా సాలురా మండలం సిద్దాపూర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు పైన పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్ కథనం ప్రకారం… ఇటీవల వరదల కారణంగా బికినీల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కల్దుర్కి శివారులోని నిల్వచేసిన ప్రాంతం నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ల […]

‘మిరాయ్’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. థ్రిల్ అవుతారు: తేజ

సూపర్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన […]

వర్షాలకు కూలిన కలెక్టర్ భవనం పైకప్పు

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలోని పురాతన గది పై కప్పు కూలింది. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కలెక్టర్ వెనుక భాగం కూలిపోయింది. అతి పురాతన నిజాం కాలం నాటి భవనం ఉండడం వల్ల కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేక పోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జిల్లా పాలనాధికారి ఉండే, జిల్లాకు సంబంధించి వివిధ రికార్డులు భద్ర పరిచే కార్యాలయాన్ని పట్టించుకోకపోవడం విస్మయానికి గురి […]

మెదక్‌లో భారీ వర్షం

ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షంతో జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయాయి. ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలుకాలనీలు నీటితో నిండి చెరువుల్లా తలపించాయి. ఉదయం 9.30 గంటల నుండి 12.30 వరకు ఏకదాటిగా వర్షం కురియడంతో పట్టణంలోని ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా వరదనీరు పలు […]

హైదరాబాద్‌లో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కల్చరల్ ఫెస్టివల్

తెలంగాణ రాష్ట్రంతో ఈశాన్య రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక పరమైన బంధాన్ని మరింతగా పటిష్ఠ పర్చేందుకుగాను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆలోచనల మేరకు తెలంగాణ – నార్త్‌ ఈస్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ అనే పేరుతో రెండు విడతలుగా మూడు రోజులు చొప్పున హైదరాబాద్ లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాల నిర్వహణపై గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి […]

ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యానికి మమ్మల్ని బాధ్యులను చేస్తారా..!: కోట నీలిమ

రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాతో పాటు బిజెపి తనపై చేసిన ఆరోపణలపై పిసిసి వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ స్పందించారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2017లో అడ్రెస్ మార్పు కోసం ఫార్మ్-6 అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పత్రం సైతం తీసుకున్నామన్నారు. అడ్రెస్ మార్పు అనే ప్రక్రియ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందన్నారు. అడ్రెస్ మార్పు చేయకుండా ఎలక్షన్ […]

రాష్ట్రవ్యాప్తంగా మహిళా జనసమితి కమిటీలు : కోదండరాం

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జనసమితి కమిటీల నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణజనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం పార్టీ మహిళా నాయకులను కోరారు. తెలంగాణ జన సమితి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిజెఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ లు […]

12 జిల్లాల కలెక్టర్లు బదిలీ – ఏపీ సర్కార్ ఉత్తర్వులు, పూర్తి వివరాలు

ఏపీలో పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నన విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్, అటామనస్ డిగ్రీ కాలేజీలు ఖాళీ సీట్ల వివరాలు నోటీసులు బోర్డులో పొందుపరచడంతో పాటు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో పెట్టాలని తెలిపారు. ఈనెల 15,16 తేదీలలో ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా లోకల్ విద్యార్థులతో ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్ విద్యార్థుల కోసం […]