ఏపీ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలోపు చెల్లించాలి, ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్టు ఐపీఈ మార్చి 2026 ఫీజు వివరాలను వెల్లడించింది. చివరి తేదీని కూడా ప్రకటించింది. ఆలస్యం చేస్తే ఛాన్స్ ఉండదని కూడా తెలిపింది.

ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ స్టార్ట్.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

AP EAMCET Counselling 2025 : ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు eapcet-sche.aptonline.in/EAPCETలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఇక్కడ వర్షాలు!

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనంతో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సిఎం రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారు:హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌ను మించిపోయారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సిఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు తెలిపారు. కెసిఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం … Read more

కెటిఆర్‌కు నీటిపారుదలపై అవగాహన లేదు:మంత్రి వివేక్ వెంకటస్వామి

మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచే నీళ్లోస్తాయని, కెటిఆర్‌కు నీటి పారుదలపై అవగాహన లేదని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను గతం లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. కెసిఆర్ కోసమే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మించా రని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసింది ఒరిజినల్ ప్రాజెక్టు అని చెప్పారు. కెటిఆర్ … Read more

కెటిఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై నమోదైన కేసులను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. గతేడాది పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా కెటిఆర్ తమ పేరు ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో నల్గొండలో వేరువేరు పోలీస్ స్టేషన్‌లలో కెటిఆర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ కెటిఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ … Read more

ఉక్రెయిన్‌లో పెన్షనర్లపై రష్యా బాంబు దాడి.. 21 మంది మృతి

తూర్పు ఉక్రెయిన్‌లో మంగళవారం ఒక గ్రామంపై రష్యా గ్లైడ్ బాంబు దాడికి 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొనెట్‌స్క్ రీజియన్ లోని యరోవా గ్రామంలో పెన్షన్ల కోసం బారులు తీరిన వృద్ధులపై ఈ బాంబు దాడి జరగడం శోచనీయం. ఈ దాడి అత్యంత పాశవికమని , రష్యా తన దురాక్రమణకు తగిన మూల్యం చెల్లించుకునేలా అదనపు ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థించారు. … Read more

’తెలుసు కదా’ టీజర్ వచ్చేస్తోంది

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ’తెలుసు కదా’ అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్టైలిస్ట్-, ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ’మల్లికా గంధ’ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తెలుసు కదా టీజర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. టీజర్‌తో పాటు ఒక … Read more