హేమంత్ సోరెన్‌ని కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీఎం హేమంత్ తండ్రి శిబూ సోరెన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శిబూ సోరెన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా అక్కడ విస్తృతంగా పర్యటించి […]

బోధన్‌లో ఉగ్రవాది పట్టివేత.. భయాందోళనలో స్థానికులు..

Nizamabad Bhodhan

బోధన్‌: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో (Nizamabad Bhodhan) అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఎ అధికారులు పట్టుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ, పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత బోధన్ కోర్టు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి అనంతరం పటియాలాకు తరలించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఎ, ఢిల్లీ స్పెషల్ పోలీసులు […]

నేపాల్ తదుపరి ప్రధానిగా సుశీలా కర్కి

నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు జనరల్ జెడ్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. దాదాపు ఐదు వేలమంది యువకులు వర్చువల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.జనరల్ జెడ్ ఆన్ లైన్ లో నిర్వహించిన సమావేశం ప్రధానంగా దేశ అత్యున్నత పదవికి అర్హులైన అభ్యర్థులపై ప్రధానంగా చర్చించింది. ఒకదశలో ఖాట్మండు మేయర్ బాలెన్ షా పట్ల అనుకూలత వ్యక్తమైనా, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక […]

ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి

ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, సత్యంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి పంచాయతీ పరిధిలోని సత్యంపేట గ్రామంలో సోయం శివ,సంధ్యారాణి దంపతుల కుమార్తె మోక్ష దుర్గ (1) ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంత పై మూత లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో కొద్దిసేపటికి […]

కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో పురుగుల భోజనం

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహంలో వడ్డించిన భోజనంలో బుధవారం పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందులో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. రిజిస్టర్, వంటగదిని పరిశీలించి గోదామును తనిఖీ చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని […]

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం […]

ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నాం : టీటీడీ ఈవో సింఘాల్

టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.

ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నాం : టీటీడీ ఈవో సింఘాల్

టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.

15 ఉద్యోగ సంఘాలకు మళ్లీ గుర్తింపు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవతో సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగసంఘాలు తిరిగి ప్రభుత్వ గుర్తింపునకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగసంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు(జివో నెం.185) జారీచేసింది. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]

నేపాల్‌లో చిక్కుకుపోయిన 261 మంది తెలుగు పర్యాటకులు.. రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు!

జనరేషన్ జెడ్ నిరసనలతో నేపాల్ అట్టుడుకిపోతున్న విషయం తెలిసిందే. అక్కడ అనే మంది భారతీయ పర్యాటకులు చిక్కుతున్నారు. అందులో సుమారు 261 మంది తెలుగువారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది