కెటిఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

KTR

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.టి. రామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా […]

కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి

ఉటా లోని ఒరెమ్ లోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మితవాద అమెరికన్ కార్యకర్త చార్లీ కిర్క్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మెడపై తుపాకీతో జరిపిన కాల్పులలో చార్లీ మరణించారు. కిర్క్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాల్పులు జరిగిన క్షణంలో చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హత్యకు సంబంధించి సెల్ ఫోన్ వీడియో క్లిప్ లలో కిర్క్ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో జనాల్ని ఉద్దేశించి […]

పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.26,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్‌లోని పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, నాగోల్‌బండ్లగూడకు చెందిన దండుల సాయికుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు. నిందితుడి సమీపంలో ఉంటున్న బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు […]

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు – ఈనెల 20న సీట్ల కేటాయింపు

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు ఈనెల 15వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 20వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. pgcet-sche.aptonline.in వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి: నాదెండ్ల

Distribution goods ration shops

అమరావతి: ఎపిలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే 96.5 శాతం ఇకెవైసికి అర్థం (“ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్”) ఇది ఒక డిజిటల్ ప్రక్రియ. చేసిన ఏకైక రాష్ట్రం ఎపి అని నాదెండ్ల  కొనియాడారు. ఈ నెల 15 నుంచి అన్నిజిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. […]

బజాజ్, హోండా, హీరో బైక్‌ల ధరలు తగ్గాయి… ఏ మోడళ్లపై ఎంత తగ్గుతుందంటే?

ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సవరణ నిర్ణయంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.

వాహనమిత్ర స్కీమ్ : ఒక్కొక్కరికి రూ.15 వేలు – అర్హులను ఎలా ఎంపిక చేస్తారు..? ముఖ్యమైన 10 విషయాలు

ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వాహనమిత్ర కింద రూ.15 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. అయితే ఈ స్కీమ్ కు అర్హులెవరు..? ఎంపిక విధానం ఎలా ఉంటుంది..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

జూ కీపర్‌ను చంపి పీక్కుతిన్న సింహాలు… వీడియో వైరల్

Lion attack Zookeeper

బ్యాంకాక్: థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జూకీపర్‌ను సింహాలు చంపి పీక్కుతిన్నాయి.   బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో జియన్ రంగ ఖరాసమీ అనే వ్య‌క్తి 20 ఏళ్లుగా సింహాల కేర్‌కేట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. జియన్ రంగపై సింహాలు దాడి చేసి పీక్కుతిన్నాయి. వాహ‌నాల హార‌న్లు కొడుతూ, గ‌ట్టి గ‌ట్టిగా అరిచిన 15 నిమిషాల‌కు పైగా అత‌నిపై సింహాలు దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి సింహాలు పీక్కుతిన్నాయి. దీనికి సంబందించిన […]

పాలకుర్తిలో ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన కూతురు

Palakurthi Jangaon

జనగామ: ఆస్తి కోసం కన్నతల్లిని కసాయి కూతురు చంపింది. ఈ సంఘటన  జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన లక్ష్మి అనే మహిళకు సంగీత అనే కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం  వీరయ్య అనే యువకుడితో తన కూతురు పెళ్లి చేసింది. వివాహ సమయంలో కట్నం కింద లక్ష్మి తన ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి, ఆ డబ్బుతో 9 తులాల బంగారం చేయించి కూతురుకి కట్నం […]

42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్

42% reservations for BC

హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 42శాతం రిజర్వేషన్‌ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకొని, గవర్నర్ ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను […]