ఐటం సాంగ్‌లో తమన్నా.. మామూలుగా రెచ్చిపోలేదు..
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah) ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారు మతిపోగొడుతుంది. తాజాగా మరో ఐటం సాంగ్‌లో కనిపించి.. తన గ్లామర్‌తో సందడి చేసింది తమన్నా. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. ఈ గురువారం నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. బాలీవుడ్ తీరుతెన్నులపై ఈ సిరీస్‌ని రూపొందించారు. […]