విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?
సెప్టెంబర్ -17 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. కానీ ఆ రోజును ఎలా జరుపుకోవాలని, ఏమని పిలవాలని గడచిన 77 సంవత్సరాలుగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. కొందరు విలీనం అంటారు, మరికొందరు విమోచనమంటారు, ఇంకొందరు విద్రోహమంటారు. గత ప్రభుత్వం సమైక్యత అంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది. చరిత్రలో ఇంత సంక్లిష్టమైన, ఒక నిర్ణయానికి రాని రోజు ఉండక పోవచ్చు. చరిత్రను చారిత్రక నేపథ్యంతో అర్థం చేసుకుంటే ఈ రకమైన సంక్లిష్టతకు అవకాశం ఉండదు. […]