రీవాల్యూయేషన్.. కుదరకపోతే మళ్లీ పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఇప్పటికే నిర్వహించిన ఈ పరీక్షా ప్ర శ్నా పత్రాలను పునః మూల్యాంకనం చేయాల ని అది సాధ్యం కానిపక్షంలో పరీక్షలను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు గాను ఎనిమిది నెలల గడువును కూడా ధర్మాసనం ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, తమ ప్రశ్నా పత్రాలను అర్హత లేని వారితో […]

కెటిఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై నమోదైన కేసులను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. గతేడాది పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా కెటిఆర్ తమ పేరు ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో నల్గొండలో వేరువేరు పోలీస్ స్టేషన్‌లలో కెటిఆర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ కెటిఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ … Read more