రేపు ప్రజాపాలన దినోత్సవం

ఈనెల 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి సైతం 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనుండగా మంత్రులు వివేక్ మెదక్ జిల్లాలో, కొండా సురేఖ, వరంగల్‌లో, […]

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం […]

ఫార్ములా ఈకార్‌రేసు నిందితులపై త్వరలో ఛార్జిషీట్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చే సుకుంది. ప్రభుత్వానికి ఎసిబి అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతుంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధిం చి ఎసిబి సుదీర్ఘకాలం విచారించింది. బిఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను రెండు సార్లు విచారణ చేసింది. ఈ కేసులో విషయాలను గు రించి ఆరా తీసింది. సిఎం ఢిల్లీలో ఉండటంతో బుధవారం […]