బిసిలను మోసం చేసిన కాంగ్రెస్: తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బిసిలను మోసం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న విమర్శించారు. హన్మకొండలోని హరిత కాకతీయలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులో పక్కా మోసం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రతియేటా రూ.20 వేల కోట్ల పేరు చెప్పి తొలి బడ్జెట్‌లో రూ.9,200 కోట్లు పెట్ట్టి రూ.2,100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పది అంశాలతో […]