‘తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025’కు కెటిఆర్‌కు ఆహ్వానం
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ మంగళవారం ఒయు మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్‌తో కలిసి తాల్ హాస్పిటల్స్ సిఇఒ సాయి గుండవెల్లి నగరంలో కెటిఆర్‌కు కలిసి ఆహ్వానించారు. 2025 అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (యుసిఎస్‌డి)లో ఈ ‘హెల్త్‌ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. […]