భక్తుల డబ్బు కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు: సుప్రీం కోర్టు

governors duties begins

న్యూఢిల్లీ: దేవాలయాలకు భక్తులు సమర్పించే డబ్బులు కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయ నిధులను ప్రభుత్వ విధులుగా పరిగణించలేమంటూ మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. తమిళనాడు లోని ఐదు దేవాలయాలకు చెందిన నిధులతో రాష్ట్రం లోని వివిధ ఆలయాల ప్రాంగణాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పిటిషనర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం రాష్ట్ర […]

చట్టవిరుద్ధమైతే సర్ రద్దు చేస్తాం

న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సో మవారం హెచ్చరించింది. అయితే రా జ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్టు పేర్కొంది. బీ హార్‌లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సర్వే కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌జోయ్ […]

వంతరాపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్

Supreme Court

న్యూఢిల్లీ : గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జులాజికల్ రిస్కు, రీహేబిలిటేషన్ (వన్యమృగ ప్రమాద నివారణ, పునరావాస ) కేంద్రం వంతరాపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. వంతరాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై […]

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించిన కెటిఆర్

KTR

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బిఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని తాము ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన తాము పోరాడామని తెలిపారు. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు […]

చట్ట విరుద్ధంగా ఉంటే.. ‘సర్’ను రద్దు చేస్తాం: సుప్రీం హెచ్చరిక

governors duties begins

రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం 7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల […]

వక్ఫ్ చట్టం 2025లో ఓ ప్రొవిజన్ నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం 2025 లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ (సవరణ)చట్టం2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత […]

వక్ఫ్ చట్టం సవరణలపై రేపు సుప్రీం రూలింగ్

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టం 2025 పై సుప్రీంకోర్టు సోమవారం తమ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుంది. ఈ చట్టం సవరణలను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటి విచారణ ముగిసింది. చట్ట సవరణలో మూడు ప్రధాన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కోర్టుల ద్వారా వినియోగదారుల ద్వారా, ఒప్పందాల ద్వారా సంతరించుకున్న ఆస్తుల డినోటిఫై వంటి కీలక విషయాలపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు మధ్యంతర రీతిలో వెలువడుతుంది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌తో కూడిన […]

సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు

Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 10న జారీ చేసిన ఈ ప్రకటనలో మీడియా సిబ్బంది, ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగంణంలో అధికారిక వినియోగానికి మినహా.. వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, […]

కంగనా రనౌత్‌కు షాక్.. చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు

Kangana Ranaut

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్, ఎంపి కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతులు చేపట్టిన ఉద్యమ సమయంలో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ఫదమైంది. దీంతో ఆమెపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కంగనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది […]

క్రికెట్ మ్యాచే కదా.. జరగనివ్వండి: భారత్-పాక్ పోరుపై సుప్రీం

న్యూఢిల్లీ : ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దుకు దాఖలైన పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ తేదీ ఖరారు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోవ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ వచ్చింది. 2025 ఆపియా కప్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ […]