ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ షాక్

మన తెలంగాణ/భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం, గొల్లబుద్ధారం ఎస్‌టి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులకు శనివారం విద్యుత్ షాక్ తగిలింది. హాస్టల్ వార్డెన్ విద్యార్థులను చెట్టెక్కి కొమ్మలు కొట్టాలని చెప్పగా.. వారు కొమ్మలు కొడుతుండగా ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న రాజేందర్ అనే విద్యార్థికి తీవ్ర గాయమైంది. బాలుడిని జిల్లా కేంద్రంలోని ప్రధాన అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలపాలైన మరో విద్యార్థిని హాస్టల్లోనే […]

కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో పురుగుల భోజనం

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహంలో వడ్డించిన భోజనంలో బుధవారం పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందులో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. రిజిస్టర్, వంటగదిని పరిశీలించి గోదామును తనిఖీ చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని […]