ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటం పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణది అని ప్రశంసించారు. గన్‌పార్క్‌లో అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ […]