గద్వాల లో పొలంలో బోల్తాపడిన స్కూల్ వ్యాన్
జోగులాంబ గద్వాల: ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్ప గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంమే కారణమని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌గా గుర్తించారు. క్రేన్ సహాయంతో స్కూల్ […]