ఇందిరా మహిళా శక్తితో పేదరికం నిర్మూలన:మంత్రి సీతక్క
ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో సరస్ మేళాను శుక్రవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రాంగణాన్ని ఆరంభించిన మంత్రి సీతక్క వెంట స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాలల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, […]