వివాదాస్పద కేసులో.. పృథ్వీషాకు జరిమానా విధించిన కోర్టు
ముంబై: టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు (Prithvi Shaw) ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు జరిమానా విధించింది. యూట్యూబర్ సప్నాగిల్.. పృథ్వీషా మధ్య జరిగిన వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఈ కేసులో సప్నా వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున పృథ్వీషాను రూ.100 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షా తరఫు న్యాయవాదికి జూన్ 13నే చివరి అవకాశం కల్పించారు. కానీ, ఇప్పటివరకూ అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. […]