నెల్లూరులో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.